చాయ్‌వాలా అర్షద్ ఖాన్ తరహాలో నెట్టింట్లో నేపాలీ.. నీలికళ్ల నాయకుడు పెళ్లి చేసుకుంటాడా? (ఫోటోలు)
నేపాల్‌కు చెందిన కూరగాయలు అమ్మే అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఓ చాయ్ వాలా అర్షద్ ఖాన్ ఫోటో నెట్టింట సంచలనం సృష్టించింది. అతని నీలపు కళ్ళతో నెటిజన్లను బాగా ఆకట్
నేపాల్‌కు చెందిన కూరగాయలు అమ్మే అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఓ చాయ్ వాలా అర్షద్ ఖాన్ ఫోటో నెట్టింట సంచలనం సృష్టించింది. అతని నీలపు కళ్ళతో నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాడు. ఈ ఫోటో వైరల్ కావడంతో కొన్ని సంస్థలు అతనిని మోడల్‌గా ఎంపిక చేశాయి. ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇదే తరహాలో నేపాల్‌కు చెందిన కూరగాయలు అమ్మే అమ్మాయి ఫోటో నెట్టినింట పండగ చేస్తోంది. అందమైన నవ్వు.. కఠోర శ్రమతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. నేపాల్‌కు చెందిన ఆ అమ్మాయి పేరు గుసూమ్. 11వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి తల్లిదండ్రులు రైతులు. అందుకే వారికి వ్యవసాయంలో సహకరిస్తూ ఈ అమ్మాయి చదువుకుంటోంది. కూరగాయలను అమ్ముతోంది.
ఈ అమ్మాయి కూరగాయలను మోయడం, సెల్ ఫోనులో మాట్లాడే దృశ్యాలను నేపాలీ ఫోటో గ్రాఫర్ రూప్‌చంద్ర మహర్జెన్ తన కెమెరాలో బంధించాడు. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ''నేపాలీ టర్కరివాలి'' పేరిట ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలకు లైక్స్, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే అర్షద్ ఖాన్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే అర్షద్ ఖాన్‌లో ఈ నేపాలీ అమ్మాయికి కూడా ఆఫర్లు వస్తాయా లేదా అనేది వేచి చూడాలి.