Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పిల్లికి ఎలుక సాక్ష్యం' అంటే ఇదే... ఉగ్రవాదంపై పాక్‌ను వెనకేసుకొచ్చిన చైనా..!

ఉగ్రవాదంపై పోరాడే దేశాల జాబితాలో పాకిస్థాన్ ముందు వరుసలో ఉంటుందని చైనా చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. దీంతో మరోమారు పాక్ - చైనా బంధం బహిర్గతమైంది. నిజానికి ప్రతి చెడ

'పిల్లికి ఎలుక సాక్ష్యం' అంటే ఇదే... ఉగ్రవాదంపై పాక్‌ను వెనకేసుకొచ్చిన చైనా..!
, బుధవారం, 23 ఆగస్టు 2017 (06:14 IST)
ఉగ్రవాదంపై పోరాడే దేశాల జాబితాలో పాకిస్థాన్ ముందు వరుసలో ఉంటుందని చైనా చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. దీంతో మరోమారు పాక్ - చైనా బంధం బహిర్గతమైంది. నిజానికి ప్రతి చెడ్డ పనిలోనూ పాక్‌ను వెనకేసుకొచ్చే చైనా మరోసారి అదే పనిచేసింది. 
 
ఉగ్రవాద సంస్థల విషయంలో ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిందంటూ పాక్‌‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. పాక్‌ తన తీరు మార్చుకోకపోతే వూరుకునేది లేదని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
ఇలాగే, పాక్‌ను ఉద్దేశించిన ట్రంప్‌ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే పాక్‌కు చైనా దన్నుగా నిలిచింది. ‘పిల్లికి ఎలుక సాక్ష్యం’ అన్నట్లుగా ఉగ్రవాదంపై పోరాడే దేశంలో పాక్‌ ముందుందంటూ కితాబిచ్చింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునీయాంగ్‌ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరాడుతున్న దేశాల్లో పాక్‌ ముందు వరుసలో ఉందన్నారు. 
 
ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆ దేశం త్యాగాలకు పాల్పడుతోందని కితాబిచ్చారు. దేశంలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తోందని చెప్పారు. పాక్‌ పోరాటాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాల్సి ఉందని తెలిపారు. ప్రపంచ శాంతి కోసం అమెరికా, పాక్‌ కలిసి ఉగ్రవాదంపై పోరాడాలని ఆశిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మకు కాన్పు చేసిన పదేళ్ల కుమారుడు.... ఎక్కడ?