Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో 54 ఏళ్ల నివాసం: చివరకు స్వదేశం వెళుతున్న చైనా మాజీ సైనికుడు

చైనా-భారత్ యుద్ధ కాలంలో భారత సరిహద్దుల్లోకి జొరబడి ఇండియన్ ఆర్మీకి చిక్కిన మాజీ చైనా సైనికుడు వాంగ్ క్వి 54 ఏళ్ల తర్వాత తన మాతృభూమి సందర్శనకు చైనా బయలుదేరాడు. యుద్ధం సైనికులను తమ నివాస ప్రాంతాలకు ఎలా దూరం చేస్తుందనడానికి వాంగ్ సజీవ ఉదాహరణ.

Advertiesment
former
హైదరాబాద్ , శనివారం, 11 ఫిబ్రవరి 2017 (07:33 IST)
చైనా-భారత్ యుద్ధ కాలంలో భారత సరిహద్దుల్లోకి జొరబడి ఇండియన్ ఆర్మీకి చిక్కిన మాజీ చైనా సైనికుడు వాంగ్ క్వి 54 ఏళ్ల తర్వాత తన మాతృభూమి సందర్శనకు చైనా బయలుదేరాడు.  యుద్ధం సైనికులను తమ నివాస ప్రాంతాలకు ఎలా దూరం చేస్తుందనడానికి వాంగ్ సజీవ ఉదాహరణ. భారత, చైనా రాయబార విదేశాంగ శాఖల తీవ్ర కృషి ఫలితంగా వాంగ్ తన పెద్ద కుమారుడు విష్ణుతోపాటు శుక్రవారం తెల్లవారు జామున 3.10  గంటలకు న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి బీజింగ్‌కి బయలు దేరాడు. సినిమాల్లో అయితే ఈ దృశ్యం భావోద్వేగాలను రేకెత్తించి ఉండేది కాని భారత్‌లో అయిదు దశాబ్దాల జీవితం తర్వాత వాంగ్ నిరామయంగా తన మాతృభూమిని, తన జన్మస్థలాన్ని చూడటానికి వెళ్లిపోయాడు.
 
వాంగ్‌కు రెండు సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ వీసాను మంజూరు చేశారు. అంటే రెండేళ్లపాటు భారత, చైనా మధ్య అతడు ప్రయాణించవచ్చు. ప్రతి సందర్శన సమయంలో అతడి తిరిగి వీసాకోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాంగ్‌కి తన కుటుంబానికి పాస్‌పోర్టులు పొందడంలో సహకరించింది. ఆర్థిక సహాయం కూడా చేసింది. చైనాలోనే ఉండిపోతారా అని మీడియా అడిగిన ప్రశ్నలకు వాంగ్ కుమారుడు విష్ణు సమాధానమిస్తూ తన కుటుంబంలో అందరికీ ఇప్పుడు పాస్ పోర్టులు ఉన్నాయని చెప్పాడు. నా తల్లి, చెల్లెలు, నా కూతురుకు కూడా పాస్ ‌పోర్టులు ఇచ్చారు. అయితే వారిని ఇప్పుడు మేము చైనాకు తీసుకెళ్లడం లేదు. నాన్న, నేను ఒకసారి చైనాకు వెళ్లాక, మా తదుపరి స్టెప్ ఏమిటనేది మేం నిర్ణయించుకుంటాము అని విష్ణు చెప్పాడు.
 
చైనా-భారత్ యుద్ధ సమయంలో 1963 జనవరి 3న భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన వాంగ్‍‌ చి ని భారత సైనికులు బంధించారు. ఆ సమయంలో తాను ఒక మెకానికల్ సర్వే ఇంజనీరునని వాంగ్ చెప్పుకున్నాడు. యుద్ధం ముగిసాక, అతడిన భారత ప్రభుత్వం గూఢచారిగా గుర్తించింది తప్పితే యుద్ధ ఖైదీ స్థాయిని కల్పించలేదు. 1963 నుంచి ఎనిమిదేళ్ల పాటు భారత్‌లో ఒక జైలునుంచి మరో జైలుకు బదిలీ అవుతూ వచ్చాక వాంగ్ మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని తిరోడి అనే కుగ్రామంలో వాంగ్ సెటిల్ అయ్యాడు. మాతృభూమిని చూడాలన్ని అతడి ఆకాంక్షను నెరవేర్చడానికి 2013 నుంచి తీవ్రంగా కృషి చేసిన భారత, చైనా విదేశాంగ శాఖలు ఎట్టకేలకు వాంగ్‌ని కుమారుడితో సహ చైనా పంపగలిగాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను పెంచి పోషించిన ఇన్ఫోసిస్‌లో ఇంత దిగజారుడా? గుండెబాదుకున్న ఎన్ఆర్ మూర్తి