Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేయని నేరానికి 46 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన నిర్దోషి... ఎక్కడ?

చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాడో వ్యక్తి. అత్యాచారం నేరంకింద అరెస్టైయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 46 ఏళ్లు శిక్షను అనుభవించి జైలు నుంచి విడుదలై ఇంటికి చేరాడు. అందుకే వంద మంది దోషులు తప్పిం

Advertiesment
46 years
, సోమవారం, 24 అక్టోబరు 2016 (16:20 IST)
చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాడో వ్యక్తి. అత్యాచారం నేరంకింద అరెస్టైయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 46 ఏళ్లు శిక్షను అనుభవించి జైలు నుంచి విడుదలై ఇంటికి చేరాడు. అందుకే వంద మంది దోషులు తప్పించుకున్నా ఫర్లేదు గానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదని అధికారులు జాగ్రత్త పడుతుంటారు. ఒక్కోసారి సాక్ష్యాధారాలు లేకపోవడం వలన చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలా ఓ వ్యక్తి తాను నిర్దోషినని నిరూపించుకునే అవకాశం లేక 46 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తాజాగా జరిపిన డీఎన్‌ఏ పరీక్షలో అతను నిర్దోషి అని తేలింది. 
 
ఆ వివరాలను పరిశీలిస్తే... ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి.. ఆమె నాలుగేళ్లు కుమారుడ్ని కిరాతకంగా చంపినట్లు వచ్చిన ఆరోపణలతో వర్జీనియాకు చెందిన 22 ఏళ్ల షెర్మాన్‌ బ్రౌన్‌ను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన 1970లో జరిగింది. నిజానికి షెర్మాన్‌కి ఆ నేరంతో ఎటువంటి సంబంధం లేదు. తాను నిర్దోషినని ఎంత వాదించినా ఫలితం లేకుండా పోయింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు అతనికి శిక్ష విధించింది. దీంతో లాభం లేదని షెర్మాన్ వర్జీనియా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. 
 
అతని పిటిషన్‌ని పరిశీలనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఆ కేసుకు సంబంధించిన డీఎన్‌ఏ నమూనాలను పరీక్షించమని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో అసలు విషయం బయటికొచ్చింది. డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా హత్యకు, అత్యాచారానికి... షెర్మాన్‌కు ఏ సంబంధం లేదని తేలింది.

దీంతో వర్జీనియా సుప్రీంకోర్టు షెర్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ అతడిని విడుదల చేసింది. 46 ఏళ్ల తర్వాత తన తల్లిని చూశానని, ఇలాంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదని షెర్మాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు నేరంతో ఎలాంటి సంబంధం లేకుండానే.. తనపై పోలీసులు తప్పుడు అభియోగాలు మోపారని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. 2017 మార్చి వరకు ఉచిత సేవలు!?