Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యాచార ఘటనపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళితే... పోలీస్ కమిషనరే రేప్ చేశాడు...

తనపై జరిగిన అత్యాచార ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషనుకు వెళ్లిన ఓ యువతిపై సాక్షాత్ పోలీసు కమిషనరే రేప్ చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం ఆప్ఘనిస్థాన్ దేశంలోని బల్కా ప్రావిన్స్

Advertiesment
Afghan woman
, మంగళవారం, 8 నవంబరు 2016 (13:11 IST)
తనపై జరిగిన అత్యాచార ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషనుకు వెళ్లిన ఓ యువతిపై సాక్షాత్ పోలీసు కమిషనరే రేప్ చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం ఆప్ఘనిస్థాన్ దేశంలోని బల్కా ప్రావిన్స్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
18 యేళ్ళ యువతిని ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి ఇంట్లో నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దీంతో ఈ ఘటనపై తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని పోలీసుస్టేషనుకు వెళితే అక్కడ ఉన్న పోలీసు కమిషనర్, తన తండ్రిని బయట వేచి ఉండమని చెప్పి తనను లోపలకు తీసుకువెళ్లి మళ్లీ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని ఆ యువతి విలపిస్తూ చెప్పింది. 
 
రేప్ చేశాక పెదవి విప్పి నిజం చెపితే హతమారుస్తానని పోలీసు కమిషనర్ తనను బెదిరించాడని బాధిత యువతి ఆరోపించింది. అత్యాచారానికి గురైన తన కూతురు జరిగిన పరాభవంతో ఇంటి నుంచి బయటకు రాలేక సజీవంగా కాల్చుకోవాలనుకుందని బాధిత యువతి తండ్రి ఆవేదనగా చెప్పాడు. తన కూతుర్ని తీసుకొని రాజధాని నగరమైన కాబూల్ కు వచ్చిన తండ్రి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రైనేజీ కాలువలో గర్భసంచితో కూడిన శిశువుల మృతదేహాలు.. స్థానికుల షాక్