వాట్సప్ చరిత్రలో అరుదైన రికార్డ్

శనివారం, 4 జనవరి 2020 (08:40 IST)
న్యూ ఇయర్ రోజున 100 బిలియన్ ల మెసెజ్ లు  షేర్ చేసుకున్న యాప్ గా రికార్డ్ సృష్టించింది వాట్సప్. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 31 న  24 గంటల్లో 100 బిలియన్ ల కు పైగా  న్యూ ఇయర్  విషెస్  మెసేజ్ ను షేర్ చేసుకున్నారు వాట్సప్ యూజర్స్.

ఇందులో ఇండియా నుంచే 20 బిలియన్ ల మెసేజ్ లు ఉన్నాయి. వాట్సాప్ ను భారత్ లోనే ఎక్కువగా యూజ్ చేస్తుండటం విశేషం.

వాట్సాప్ యాప్ చరిత్రలోనే  ఒక్క రోజులోనే ఎక్కువ మెసేజ్ లు పంపించుకోవడం ఇదే మొదటి సారని తెలిపింది.ఇందులో  కొందరు టెక్స్ట్ మెసేజ్ చేయగా.. ఫోటోలతో  మెసేజ్ చేసిన వారు 12 బిలియన్ లు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాజధాని మార్చే హక్కు జగన్‌కి లేదు: సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు