Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓరి వీడి మతిమరుపు మండా...! బీఎండబ్ల్యు కారునే మర్చిపోయి ఏం చేశాడో తెలుసా?

మతిమరుపు కొందరిలో కనబడుతుంటుంది. కొంతమంది చేతిలోనే వస్తువును పెట్టుకుని ఎక్కడ పెట్టానబ్బా అంటూ వెతుకులాడుతుంటారు. చివరికి... మీ చేతిలోనే ఉన్నదండీ అని అంటే, ఓర్ని తస్సాదియ్యా అంటూ నవ్వుకుంటారు. మరికొందరు ఎక్కడో పెట్టేసి పెట్టిన చోట ఎక్కడబ్బా అని తల బద

ఓరి వీడి మతిమరుపు మండా...! బీఎండబ్ల్యు కారునే మర్చిపోయి ఏం చేశాడో తెలుసా?
, మంగళవారం, 10 జనవరి 2017 (17:24 IST)
మతిమరుపు కొందరిలో కనబడుతుంటుంది. కొంతమంది చేతిలోనే వస్తువును పెట్టుకుని ఎక్కడ పెట్టానబ్బా అంటూ వెతుకులాడుతుంటారు. చివరికి... మీ చేతిలోనే ఉన్నదండీ అని అంటే, ఓర్ని తస్సాదియ్యా అంటూ నవ్వుకుంటారు. మరికొందరు ఎక్కడో పెట్టేసి పెట్టిన చోట ఎక్కడబ్బా అని తల బద్ధలు కొట్టుకుంటుంటారు. ఎంతసేపటికీ జ్ఞాపకం రాదు. చివరికి ఎక్కడో వస్తువు కనబడేసరికి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. ఇలాంటివాటికి భిన్నమైన రాక్షస మతిమరుపు వ్యక్తి ఒకడు వెలుగులోకి వచ్చాడు.
 
వివరాల్లోకి వెళితే... ఓ సంగీత కార్యక్రమాన్ని ఆస్వాదించేందుకు లండన్ కు చెందిన ఓ వ్యక్తి స్కాట్లాండు నుంచి మాంచెస్టరుకు వెళ్లాడు. వచ్చే దారిలో పాటలు వింటూనే కారును ఓ పార్కింగ్ స్థలంలో ఆపేసి చాలా ఉత్సాహంగా కార్యక్రమానికి హాజరయ్యాడు. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాడు. ఈవెంట్ ముగిశాక బయటకు వచ్చి కారు కోసం అటూఇటూ తిరిగాడు. అసలు కారు ఎక్కడ పెట్టాడో గుర్తు రాలేదు. బుర్ర పగలగొట్టుకున్నా ఎంతకీ జ్ఞాపకం రాలేదు. దీంతో తన కారు ఎక్కడ పెట్టానో గుర్తు రావడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
చివరికి పోలీసులు ఓ ప్రాంతంలో దుమ్ము,ధూళి కొట్టుకుని పార్కింగ్ చేసి వున్న కారును ఓచోట గుర్తించారు. అది, తమకు ఫిర్యాదు చేసిన వ్యక్తిదే అని నిర్థారణకు వచ్చారు. అది కూడా కారు జూన్ నెలలో మిస్సయితే, వీళ్లు జనవరిలో దాని ఆచూకి కనుక్కున్నారు. దాంతో అతడికి ఫోన్ చేసి కారు ఆగివున్న చోటకు తీసుకొచ్చి ఇదేనా అనడిగితే... ఆ... అవును... ఇక్కడే పార్క్ చేశాను. ఎంత చేసినా గుర్తు రాలేదు. ఇప్పుడు గుర్తు వస్తుంది అనుకుంటూ బుర్ర గోక్కుంటూ కారు స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రైవేటు కంపెనీలో ఒబామా ఉద్యోగం...? 1600 మంది ఉద్యోగుల్లో ఒకడిగా...?