Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థాయ్ బీచ్ ఒడ్డున బీర్ తాగుతూ శృంగారం కావాలన్నాడు... వద్దన్నందుకు చంపేశాడు...

Advertiesment
థాయ్ బీచ్ ఒడ్డున బీర్ తాగుతూ శృంగారం కావాలన్నాడు... వద్దన్నందుకు చంపేశాడు...
, శనివారం, 20 ఏప్రియల్ 2019 (16:24 IST)
అతడికి 51 ఏళ్లు. ఆమెకి 29 ఏళ్లు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే ఓ రోజు సాయంత్రం వేళ జాలీగా పార్టీ చేసుకుందామని థాయ్‌లాండ్ బీచ్ ఒడ్డుకు వెళ్లారు. ఇద్దరూ కలిసి బాగా బీర్ తాగారు. ఇంతలో హఠాత్తుగా అతడు తనకు శృంగారం కావాలని ఆమెని అడిగాడు. ఆమె అందుకు ససేమిరా అంది. అంతే... ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. 
 
వివరాల్లోకి వెళితే... 51 ఏళ్ల స్మిథాన్ తరచూ విదేశాలకు ట్రిప్పులేస్తుంటాడు. దాంతో మొదటి భార్య అతడిని ఛీకొట్టి వెళ్లిపోయింది. తర్వాత 29 ఏళ్ల ఫిట్నెస్ ట్రెయినర్ అయిన స్మితాంను పెళ్లాడాడు. ఆ తర్వాత కూడా అతడి ట్రిప్పులు మామూలే. ఐతే ఎందుకో అతడికి ఆమెపై అనుమానం కలిగింది. తను లేనప్పుడు మరికొందరితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానపడ్డాడు. కానీ ఆమెను ఏమీ అనలేదు. 
 
ఓ రోజు సాయంత్రం పూట సరదాగా పార్టీ చేసుకుందాం రమ్మని ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ భార్యాభర్తలిద్దరూ పూటుగా బీర్ సేవించారు. ఆ మత్తులో అతడు తనకు శృంగారం కావాలంటూ అడిగాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దాంతో... ఏం... ఎవరితోనైనా లింకులు పెట్టుకున్నావా... నాతో ఎందుకు కాదంటున్నావంటూ కాళ్లతో ఆమెను విచక్షణారహితంగా తన్నడం ప్రారంభించాడు. అతడు దెబ్బలకు తాళలేక ఆమె అక్కడి నుంచి పరుగులు తీసింది. అయినా వదల్లేదు. వెంబడించాడు. 
 
కొంతదూరం వెళ్లాక ఆమె పట్టుతప్పి కిందపడిపోయింది. దాంతో ఆమెను వివస్త్ర చేసి అత్యాచారం చేయబోయాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో ముష్టిఘాతాలతో ఆమెను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఓ బ్లాంకెట్ తీసుకెళ్లి ఆమె శవంపై కప్పేసి వెళ్లిపోయాడు. బీచ్ పక్కనే శవం వుండటాన్ని చూసిన స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ ఎమ్మెల్యేకు జీవితఖైదు