Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెల్ఫీ పిచ్చోళ్లు వచ్చేశారు బాబోయ్.. మేక పరార్.. సముద్రంలోకి జంప్.. చివరకు ఏమైంది?

సెల్ఫీ పిచ్చి బాగా ముదిరింది. సెల్ఫీ మోజుతో మూగజీవులపై హింసలు పెచ్చరిల్లిపోతున్నాయి. అందమైన ప్రాంతాల్లో స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం పోయి మూగజీవులతో సెల్ఫీలు తీసుకునేందుకు జనాలు ఎగబడుతున్నారు.

Advertiesment
Alaskan mountain
, మంగళవారం, 26 జులై 2016 (13:50 IST)
సెల్ఫీ పిచ్చి బాగా ముదిరింది. సెల్ఫీ మోజుతో మూగజీవులపై హింసలు పెచ్చరిల్లిపోతున్నాయి. అందమైన ప్రాంతాల్లో స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం పోయి మూగజీవులతో సెల్ఫీలు తీసుకునేందుకు జనాలు ఎగబడుతున్నారు. మూగ జంతువులతో సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది.

ఈ క్రమంలో జనాల్ని చూస్తేనే మూగ జీవులు జడుసుకుంటున్నాయి. జూల్లో, పార్కుల్లో మూగజీవులు జనాలొస్తున్నారని తెలిస్తేనే పారిపోతున్నాయి. ఇదే తరహాలో జనాన్ని చూసిన ఓ మేక భయంతో పారిపోయి... సముద్రంలో దూకేసింది. ఈ ఘటన అలస్కాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అలస్కాలోని సీవార్డ్‌ అనే ప్రాంతంలో ఉండే మౌంటెన్‌ గోట్స్‌ చూసేందుకు ప్రత్యేకంగా అందంగా కనిపిస్తాయి. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లిన వారంతా ఆ మేకలతో సెల్ఫీలు దిగడానికి  ఎగబడుతున్నారు. ఈ క్రమంలో గత శనివారం కూడా ఓ మేకతో చాలామంది బలవంతంగా సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు.

ఆపై మేత కోసం వెళ్తున్న సమయంలో సెల్ఫీల కోసం ఓ గుంపు దానిని తరుముకుంది. ఆ గుంపు నుంచి తప్పించుకునే క్రమంలో దారిలేకుండా ఆ మేక సమీపంలోని సముద్రంలో దూకేసింది. దీంతో ప్రాణాలు కోల్పోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్గిల్ అమరవీరులకు ప్రధాని మోడీ సెల్యూట్ :: ప్రణబ్ నా వేలు పట్టుకుని నడిపించారు!