న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై సెప్టెంబరు 11, 2001న ఉగ్రవాద దాడి జరిగే వరకు అమెరికా- అల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్, తాలిబాన్ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఫారిన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)లో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన మాజీ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. ఒసామా- అమెరికా మధ్య 9/11 వరకు సన్నిహత సంబంధాలు ఉండేయని చెప్పారు.
మధ్య ఆసియా ప్రాంతంలో అల్ ఖైదా, తాలిబాన్ తీవ్రవాద గ్రూపులతో అమెరికా కలిసి పనిచేసింది. ఆఫ్ఘన్- సోవియట్ యుద్ధం సందర్భంగా అమెరికా ఈ గ్రూపులను ఉపయోగించుకుంది. ఈ సంబంధాలు సెప్టెంబరు 11, 2001 వరకు కొనసాగాయని ఎఫ్‌బీఐ మాజీ తుర్కిష్ భాష అనువాదకుడు సిబల్ ఎడ్మండ్స్ "మైక్ ముల్లే షో" అనే రేడియా కార్యక్రమంలో చెప్పారు.