Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

83 యేళ్ళ తాతను పెళ్ళి చేసుకున్న 20 యేళ్ళ యువతి.. ఎక్కడ?

83 యేళ్ళ తాతను పెళ్ళి చేసుకున్న 20 యేళ్ళ యువతి.. ఎక్కడ?
, శుక్రవారం, 4 జనవరి 2019 (16:18 IST)
కొందరు పెళ్ళి చేసుకునే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. అంతేకాదు వారి ఆచార వ్యవహారాలను బట్టి పెళ్ళి చేసుకుంటారు. అలాగే వారి పెళ్ళిళ్ళలో కూడా కొందరు వయస్సుతో నిమిత్తం లేకుండా పెళ్ళి చేసుకుంటుంటారు. ఇలాంటివి చూసిన సమయంలో అసలు ఇలాంటి పెళ్ళిళ్ళు ఎలా చేస్తుంటారని బాధపడుతుంటారు. అమ్మాయికి 20, పురుషుడికి 60 యేళ్ళ వయసులో పెళ్ళి చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది.
 
చైనాకు చెందిన కొంగ్ అనే అమ్మాయి కాలేజీలో చదువుతోంది. ఆమె వయస్సు 20 సంవత్సరాలు. అయితే చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులిద్దరు విడాకులు తీసుకున్నారు. దీంతో తన గ్రాండ్ పారెంట్స్‌తో చైనాలోని ప్రావెన్స్ అనే ప్రాంతంలో ఉంటోంది. ఇక ఆమె తాత ప్రొబికాన్ చాలా ధనవంతుడు. అంతేకాదు తన మనుమరాలికి ఏం కావాలన్నా ఇచ్చేవాడు. ఇలా తన తాత తనకు ఏది కావాలంటే అది ఇస్తున్నాడని ఆయనపై ఇష్టం పెంచుకోవడం మొదలుపెట్టింది. 
 
83 యేళ్ళ తన తాత అనారోగ్యంగా ఉంటున్నాడు. తాతను ఆసుపత్రిలో చేర్పించి రెండు నెలలు తాతకు సేవ చేసింది మనుమరాలు. తన తాతను పెళ్ళి చేసుకున్న ఫోటోలను సోషియల్ మీడియాలో పెట్టింది. అంతేకాదు ఆమె తెల్లని దుస్తులు, తాత సూట్‌లో ఉన్న ఫోటోలను పెట్టింది. దీంతో నెటిజన్లు ఆమెను తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టారు. అయితే అదంతా ఆమె పట్టించుకోలేదు. ఎవరు ఏమనుకున్నా జీవితాంతం ఆయనతోనే కలిసి ఉంటానని చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్షణ లేదన్నవారిపై బాంబులేస్తాం : బీజేపీ ఎమ్మెల్యే