'అనకొండ' సినిమా గుర్తుందా?.. ఒళ్లు గగుర్పొడిచేలా వుండే ఆ దృశ్యాలు, అందులోని అనకొండ ఎలా మర్చిపోగలం? కానీ అలాంటి అనకొండ నిజజీవితంలో నూ వుందంటూ వార్తలు వెలువడుతున్నాయి. బ్రెజిల్ దేశంలోని జింగు నదిలో 50 అడుగుల పొడవైన అనకొండ ప్రత్యక్షమైందంటూ ప్రముఖ ట్విట్టర్ ఈ వీడియోను పోస్టు చేసింది.
తొలిసారి 2018 సంవత్సరంలో అనకొండ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పటి నుంచి ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం మరోసారి ప్రముఖ ట్విట్టర్ ఖాతా నుంచి 50 అడుగుల అనకొండ వీడియోను పోస్ట్ చేయడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
అయితే ఈ వీడియో నిజం కాదని ఫాక్ట్-చెకింగ్ వెబ్‌సైట్ పేర్కొంది. 2018లో తొలిసారి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోతో పోలిస్తే ఇందులో అనకొండ విస్తీర్ణం కూడా మారిపోయిందని, వాస్తవం కంటే చాలా పెద్దదిగా చిత్రీకరించారంటూ పేర్కొంది. అయితే ఈ వీడియోను చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.