చంద్రమండలంపై 4జీ నెట్‌వర్క్...
త్వరలో చంద్రమండలంపై కూడా 4జీ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపి ఐదు దశాబ్దాలు అయింది.
త్వరలో చంద్రమండలంపై కూడా 4జీ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపి ఐదు దశాబ్దాలు అయింది. ఇంతకాలానికి ఇక్కడ సెల్ ఫోన్ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టును చర్యలు వొడాఫోన్ జర్మనీ, నోకియా, ఆడి సంయుక్తంగా సహకారం అందించుకుంటూ చేపట్టనున్నాయి.
స్పేస్ గ్రేడ్ నెట్‌వర్క్ అభివృద్ధి కోసం నోకియాను భాగస్వామిగా ఎంచుకున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది. ఇది చాలా చిన్న పరిమాణంలో ఉంటుందని తెలిపింది. వొడాఫోన్ జర్మనీ, నోకియా, ఆడి కంపెనీలు బెర్లిన్ కేంద్రంగా నడిచే పీటీ సైంటిస్ట్స్‌తో కలసి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. ఇందుకు సంబంధించి 2019లో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం కేప్ కెనరవాల్ నుంచి జరగాల్సి ఉందని వొడాఫోన్ వెల్లడించింది.