Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ బుడతడు సామాన్యుడు కాదు.. మొసళ్ళతో స్నేహం... పాములతో ఫ్రెండ్‌షిప్

సాధారణంగా చిన్నపిల్లలు ఏ చిన్న జంతువును చూసినా, పురుగును చూసినా ఇట్టే భయపడిపోతారు. కానీ, ఈ బుడతడు మాత్రం ఏకంగా మొసళ్ళతో స్నేహం చేస్తాడు. తాబేళ్లపై సేద తీరుతాడు. పాములతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తాడు.

Advertiesment
ఆ బుడతడు సామాన్యుడు కాదు.. మొసళ్ళతో స్నేహం... పాములతో ఫ్రెండ్‌షిప్
, శుక్రవారం, 23 జూన్ 2017 (09:40 IST)
సాధారణంగా చిన్నపిల్లలు ఏ చిన్న  జంతువును చూసినా, పురుగును చూసినా ఇట్టే భయపడిపోతారు. కానీ, ఈ బుడతడు మాత్రం ఏకంగా మొసళ్ళతో స్నేహం చేస్తాడు. తాబేళ్లపై సేద తీరుతాడు. పాములతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తాడు. ఇంతకీ ఆ బుడతడు పేరేంటో తెలుసా చార్లీ పార్కర్. ఈ బుడ్డోడు ఆస్ట్రేలియన్ యంగెస్ట్ రేంజర్‌గా గుర్తింపును కూడా పొందాడు. 
 
మూడేళ్ల వయసు నుంచే చార్లి పార్కర్‌ జంతువులతో స్నేహం చేస్తున్నాడు. వాటిని అమితంగా ఇష్టపడతాడు, ప్రేమతో బుజ్జగిస్తాడు. స్నేహితులతో ఆడుకుంటున్నట్లు స్వేచ్ఛగా, ఆనందంగా వాటితో ఆడుకుంటాడు. ఆ జీవులకు అవసరమైన ఆహారాన్ని ప్రేమతో తినిపిస్తాడు. అలసిపోయినప్పుడు అమ్మ ఒడిలో హాయిగా బజ్జున్నట్టు ఆ జంతువుల పైనే పడుకుంటాడు. 
 
స్కూలుకు వెళ్లి వచ్చాక జంతువులతోనే ఆ చిన్నోడి ఆటాపాటా. పార్కర్‌కు అవే ప్రపంచం. డిస్కవరీ టీవీ ప్రోగ్రాముల్లో కూడా కనిపిస్తుంటాడు. ఈ బుడ్డోడు ‘వైల్డ్‌లైఫ్‌ పార్క్‌’ రేంజర్‌ యూనిఫార్మ్‌ వేసుకుని పార్క్‌ అంతా సందడి చేస్తాడు. ఆ యూనిఫార్మ్‌లో ఉండగా.. ఆ పార్కుకి తనే రక్షణశాఖ అధికారిగా భావిస్తాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ ఎమ్మెల్యే ఫేస్ బుక్ ఖాతాలో అశ్లీల వీడియో.. ఇద్దరు యువకులు అత్యాచారం చేయబోతుండగా?