అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే తెలుగు విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అల్ఫారెట్టా, జార్జియాలో, మంగళవారం రాత్రి ఒకే వాహనం ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఆర్యన్ జోషి, శ్రీయా అవసరాల, అన్వీ శర్మగా గుర్తించారు.
మాక్స్‌వెల్ రోడ్డు దాటి వెస్ట్‌సైడ్ పార్క్‌వేలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టి చెట్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి వేగమే కారణమని అనుమానిస్తున్నారు. అల్ఫారెట్టా హైస్కూల్‌లో సీనియర్ అయిన ఆర్యన్ జోషి గ్రాడ్యుయేషన్‌కు కొద్ది రోజుల దూరంలో ఉన్నాడు. అతని ప్రిన్సిపాల్ మైక్ స్కీఫ్లీ విద్యార్థులు, తల్లిదండ్రులకు హృదయ విదారక వార్తను తెలియజేశారు.
అలాగే శ్రీయ అవసరాల.. జార్జియా విశ్వవిద్యాలయంలో ఫ్రెష్‌మెన్ అయిన అన్వీ శర్మ తమ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడి ఆసుపత్రికి తరలించారు.
ఇంకాడ్రైవర్, రిత్వాక్ సోమేపల్లి, జార్జియా స్టేట్ యూనివర్శిటీ విద్యార్థి, అల్ఫారెట్టా హైలో సీనియర్ అయిన మహమ్మద్ లియాకత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అమెరికా పోలీసులచే దర్యాప్తు జరుగుతోంది.