Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో కారులో వెళుతున్న భారతీయుడిపై కాల్పులు... మృతి

Advertiesment
aditya
, శుక్రవారం, 24 నవంబరు 2023 (08:57 IST)
అమెరికాలో దారుణం జరిగింది. కారులో వెళుతున్న ఓ భారతీయుడుని దిండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ దారుణ ఘట ఓహోయో రాష్ట్రంలో జరిగింది. మృతుడిని యూనవిర్శిటీ ఆఫ్ సిన్సినాటీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆదిత్య అడ్లఖాగా గుర్తించారు. ఈ ఘటన ఈ నెల 8వ తేదీన జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆదిత్య.. యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతూ ఈ నెల 18వ తేదీన ప్రాణం విడిచాడు. 
 
ఈ భారతీయ విద్యార్థి సిన్సినాటీ యూనివర్శిటీ పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఆదిత్యపై ఈ నెల 8వ తేదీన హత్యాయత్నం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో ఆదిత్య కారు వెస్టర్న్ వయాడక్ట్ వద్ద కనిపించగా, గోడకు ఢీకొన్న కారులో ఆదిత్య విగతజీవిగా కనిపించాడు. కారుపై పలుమార్లు కాల్పులు జరిగినట్టు పోలీసులు గుర్తించారు కిటికీ అద్దానికి మూడు బుల్లెట్ రంధ్రాలు కూడా గుర్తించారు. 
 
ఆ తర్వాత పోలీసులు బాధితుడని యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆదిత్య ఈ నెల 18వ తేదీన ప్రాణాలు కోల్పోయాడు. ఆదిత్య మరణ వార్త తెలుసున్న అతడి తల్లిదండ్రులు, కుటుం సభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. అల్సరేటివ్ కోలైటిస్‌పై పరిశోధన చేస్తున్న ఆదిత్యకు గత యేడాది ఉపకార వేతనం కూడా లభించింది. 2025లో ఆదిత్య పీహెచ్‌డీ పూర్తికావాల్సివుంది. ఇంతలోనే అతను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి, కుటుంబానికి తీరనిశోకం మిగిల్చాడు. ఈ కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కేలర్ ద్వారా తన కలల ఉద్యోగాన్ని 170% జీతం పెంపుతో పొందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్