భారత వాణిజ్య రాజధాని ముంబైపై జరిగిన తీవ్రవాద దాడులకు సూత్రధారులుగా భావిస్తున్న వారిని ప్రాసిక్యూట్ చేయాలని పాకిస్థాన్‌కు అమెరికా మరోమారు కోరింది. అదేసమయంలో పాక్ గడ్డపై భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాలపై వ్యక్తమవుతున్న ఆందోళనను కూడా వైట్‌హౌస్ పరగణంలోకి తీసుకుంది.
ముంబై దాడులకు సూత్రధారులుగా భావిస్తున్న లష్కర్ ఇ తోయిబా ఫౌండర్ హఫీజ్ సయీద్‌తో పాటు.. మరో ఏడుగురిని చట్టం ముందు నిలబెట్టాలని భారత్ డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, పాకిస్థాన్ పాలకులతో పాటు.. ఆ దేశ కోర్టులు కూడా సయీద్‌పై చర్య తీసుకునేందుకు ససేమిరా అంటున్నాయి.
దీనిపై యూఎస్ రాయబారిలి తిమోతీ రోమెర్ మాట్లాడుతూ.. ముంబై దాడులకు సూత్రధారులుగా భావిస్తున్న ఏడుగురు నిందితులను ప్రాసిక్యూట్ చేయడం ఎంతో ముఖ్యం. హఫీజ్ గురించి నిజాలను తెలుసుకుని, సమర్పించిన ఆధారాల ద్వారా చర్య తీసుకోవాలని కోరారు.