Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2010నాటికి అమెరికా చేతుల్లో సూపర్ బాంబు

Advertiesment
అమెరికా
అమెరికా ఆయుధాగారంలోకి వచ్చే ఏడాది సూపర్ బాంబు వచ్చి చేరనుంది. ప్రపంచంలో ఇప్పటివరకు తయారైన అత్యంత శక్తివంతమైన బాంబుల్లో ఇది కూడా ఒకటి. మిగిలిన బాంబులన్నింటి కంటే శక్తివంతమైనదిగా పేరొందిన ఈ సూపర్ బాంబు వచ్చే ఏడాది తమ అమ్ములపొదిలో చేరుతుందని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం వెల్లడించింది.

పెంటగాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సూపర్ బాంబు 14 టన్నుల బరువు కలిగివుంటుంది. దీనిని తయారు చేసేందుకు 88 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు పెంటగాన్ వెల్లడించింది. మాసివ్ ఆర్టిలరీ అనే పేరుతో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా అమెరికా రక్షణ శాఖ ఈ సూపర్ బాంబును తయారు చేస్తోంది.

6 మీటర్ల పొడవుతో తయరయ్యే సూపర్ బాంబు 60 మీటర్ల ప్రభావిత ప్రదేశంలోకి బాగా చొచ్చుకెళ్లిన తరువాత పేలుతుంది. ఈ బాంబు సృష్టించే పేలుడు తీవ్రతను ఇతర మార్గాల్లో సృష్టించాలంటే 2400 కిలోల పేలుడు పదార్థంతో క్షిపణిని ప్రయోగించాలి. గతంలో అమెరికా తయారు చేసిన బీఎల్‌యూ- 109 బాంబు కంటే ఇది రెండురెట్లు శక్తివంతమైంది.

ఇప్పటివరకు ప్రపంచంలో శక్తివంతమైన బాంబుగా గుర్తింపు పొందిన రష్యా వ్యాక్యుమ్ బాంబు కంటే ఇది ఎక్కువ విధ్వంసం సృష్టిస్తుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఈ సూపర్ బాంబును బి- 52 లేదా బి- 2 విమానాల నుంచి ప్రయోగించేందుకు వీలుగా రూపొందిస్తున్నారు. ఇరాన్ అనుమానాస్పద అణ్వాయుధ కార్యక్రమాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా ఈ బాంబు తయారీని చేపట్టినట్లు గతంలో ప్రచారం జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu