Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'అమ్మ' తనానికే మచ్చ : భర్త కామవాంఛ తీర్చమని కుమార్తెను చిత్రహింసలు పెట్టిన తల్లి

ఆ తల్లి అమ్మ తనానికే మచ్చ తెచ్చింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ కసాయి.. తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించి జైలు పాలయ్యారు. భర్త కామాంధుడిగా మారి కన్నబిడ్డను చెరపట్టాడు. అలాంటి భర్తను మందలించ

'అమ్మ' తనానికే మచ్చ : భర్త కామవాంఛ తీర్చమని కుమార్తెను చిత్రహింసలు పెట్టిన తల్లి
, శుక్రవారం, 25 నవంబరు 2016 (15:09 IST)
ఆ తల్లి అమ్మ తనానికే మచ్చ తెచ్చింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ కసాయి.. తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించి జైలు పాలయ్యారు. భర్త కామాంధుడిగా మారి కన్నబిడ్డను చెరపట్టాడు. అలాంటి భర్తను మందలించాల్సిన భార్య... కామాంధుడైన భర్తకు ఎలా సహకరించాలో కుమార్తెకు వివరించి.. ఆమెను మరింత చిత్రవధకు గురిచేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ కేసులో కన్నబిడ్డను వేధించిన భార్యాభర్తలకు కోర్టు కఠిన కారాగారశిక్ష విధించింది. శుక్రవారం వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. 
 
ఆస్ట్రేలియాకు చెందిన ఓ దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఈ పాపకు ఐదేళ్లు రాగానే తనలోని వక్రబుద్ధిని ఆ తండ్రి బయటపెట్టసాగాడు. అప్పటి నుంచి 15 యేళ్లు వచ్చేంతవరకు లైంగిక దాడి చేస్తూ వచ్చాడు. ఈయనకు కట్టుకున్న భార్య పూర్తి సహకారం అందించడమే కాకుండా, కుమార్తెకు సైతం నచ్చజెప్పి శృంగారంలో ఏ విధంగా నడుసుకోవాలో వివరించింది. అలా కాకుండా, ఎదురు తిరిగితే తమలోని రాక్షసత్వాన్ని చూపిస్తూ.. కొన్నేళ్ళపాటు వేధించారు. 
 
దీనిపై బాధిత యువతి వారి చెర నుంచి తప్పించుకుని పోలీసులకు 2011లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు.. కుమార్తెను హింసించిన తండ్రికి 48 యేళ్లు, భర్తకు సహకరించిన భార్యకు 16 యేళ్లపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, కసాయి తండ్రి మొత్తం 73 నేరాలకు పాల్పడగా, అతని భార్య 13 నేరాలకు పాల్పడినట్టు సిడ్నీ కోర్టు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

70:30 చేస్తే దొంగ‌... 40:60 చేస్తే దొర! ఇదేం వ్య‌వ‌స్థాగ‌త దోపిడీ మోదీజీ!