Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంకలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం.. 14మంది మృతి

శ్రీలంకలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం.. 14మంది మృతి
, సోమవారం, 7 జూన్ 2021 (09:26 IST)
Floods
శ్రీలంకలో రుతుపవనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలోని కొలంబో, రత్నపురతోపాటు పలు జిల్లాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి కనీసం 14 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. 
 
దాదాపు 2.40 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. గురువారం రాత్రి నుంచి దేశంలోని పలు జిల్లాల్లో రుతుపవనాల కారణంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్ళు, వరి పొలాలు, రోడ్లు మునిగిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 10 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్థంగా తయారైందని విపత్తు నిర్వహణ జాతీయ కేంద్రం అధిపతి మేజర్ జనరల్ సుదాంత రణసింగ్ తెలిపారు.
 
వర్షాలకు నిరాశ్రయులైన వారి కోసం 72 సహాయ శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో 3,500 కు పైగా కుటుంబాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే హెచ్చరికలను జాతీయ పరిపాలనా పరిశోధనా సంస్థ జారీ చేసింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యకి విడాకులిచ్చి.. మైనర్ బాలికపై కన్నేసి.. చీకటిగదిలోకి లాక్కెళ్లి...