హెరీపోటర్ చిత్రంలో రాన్ వీజలే పాత్రను పోషించిన నటుడు రూపర్ట్ గ్రింట్‌కు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది. లండన్‌లో ఆ చిత్రం ప్రీమియర్ షోకు మూడు రోజుల ముందు ఆయనకు ఈ వ్యాధి సోకిందని అతని పీఆర్ఓ వెల్లడించారు.
గ్రింట్ గత కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాని అతను హెరీపోటర్ అండ్ ది హాఫ్ బ్లడ్ ప్రిన్స్ చిత్ర విశేషాలగురించి విలేకరుల సమావేశంలో పాల్గొనేందుకు గ్రింట్, తన తోటి కళాకారులతో కలిసి వస్తారని అందరూ భావించారు.
కాని అతనికి స్వైన్ ఫ్లూ సోకిందని అతని పీఆర్ఓ చెప్పడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ కారణంగానే అతను షూటింగ్‌లకు హాజరు కాలేకపోతున్నాడని ఆయన తెలిపారు.