Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సౌదీలో 200 పాఠశాల నిర్మాణం చేపట్టనున్న చైనా

Advertiesment
సౌదీ అరేబియా
సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లో చైనా 200 పాఠశాలను నిర్మించనుంది. ఇందుకోసం చైనాకు చెందిన చైనా రైల్వే-15 బ్యూరో గ్రూపుతో సౌదీ అరేబియన్ ప్రభుత్వం తాజాగా ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఈ ఒప్పందం మొత్తం విలువు రెండు బిలియన్ రియాల్‌గా ఉందని వెల్లడించింది.

సౌదీ ప్రెస్ ఏజెన్సీ అందించిన సమాచారం మేరకు.. పాఠశాలల నిర్మాణం కోసం ఆహ్వానించిన బిడ్‌లను దక్కించుకునేందుకు పలు దేశాలకు చెందిన కంపెనీలు పాల్గొన్నాయి. అయితే, ఈ ఆర్డర్లను చైనా కంపెనీ దక్కించుకుంది.

ఈ ఒప్పంద పత్రాలపై సౌదీ ఆరేబియా విద్యాశాఖామంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ అబ్దుల్లా సంతకాలు చేశారు. భవనాల నిర్మాణానికి 14 నెలల కాలపరిమితి నిర్ణయించినట్టు సహాయ మంత్రి ఫైసల్ బిన్ మౌమ్మార్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu