ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతుల వెల్లడి సోమవారం నుంచి ఆరంభమైంది. ఈ యేడాది తొలి నొబెల్ బహుమతిని అమెరికా పరిశోధకులు కైవసం చేసుకున్నారు. శరీర కణాల్లోని క్రోమోజోమ్‌లను రక్షించే టెలిమోర్ అనే భాగాన్ని, ఎంజైమ్‌లను గుర్తించినందుకు గాను అమెరికాకు చెందిన ముగ్గురు పరిశోధకులు సంయుక్తంగా వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
కారల్ గ్రీడర్, జాక్ జోస్టక్, ఎలిజబెత్ బ్లాక్‌బర్న్‌లు కణాల పనితీరుకు సంబంధించిన మౌలిక వ్యవస్థలపై వీరు జరిపిన పరిశోధనలకు గుర్తింపుగా నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ బహుమతిని దక్కించుకున్న ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తల్లో ఒకరు ఎలిజబెత్ బ్లాక్‌బర్న్ ఆస్ట్రేలియా సంతతికి చెందిన మహిళ కాగా, మిగిలిన ఇద్దరు అమెరికా పరిశోధకులు.