వైద్యులు సూచించిన మందులే పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ మరణానికి కారణమయ్యాయని ఆయన కుటుంబ న్యాయవాది ఆరోపించారు. గుండెపోటుతో జాక్సన్ మరణానికి కొన్ని గంటల ముందు మందులు సూచించినవారి కోసం (వైద్యులు) పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు.
జాక్సన్ న్యాయవాది బ్రియాన ఆక్స్మన్ "సీఎన్ఎన్"తో మాట్లాడుతూ.. పాప్ సింగర్ ప్రమాదకర మందులు వాడే విధంగా కుట్ర జరిగిందని ఆరోపించారు. గుండెపోటు వచ్చిన సమయంలో జాక్సన్ మేనేజర్ ఫ్రాంక్ డిలియో ఆయనతోనే ఉన్నట్లు భావిస్తున్నాను.
జాక్సన్ సంరక్షణ బాధ్యతలను మోసేందుకు ఆయన కుటుంబం కొన్ని నెలల తరబడి ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఆక్స్మన్ పేర్కొన్నారు. అయితే చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనను ప్రభావితం చేస్తూ వచ్చారు.
అన్నా నికోలే స్మిత్ కంటే జాక్సన్ జీవితంలోనే ఎక్కువ దారుణాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. జాక్సన్ చివరి రోజుల్లో చుట్టూ ఉన్న మిత్ర బృందంపై ఆక్స్మన్ అనుమానం వ్యక్తం చేశారు. స్మిత్ మాదిరిగానే మందులతో జాక్సన్ మరణానికి కుట్ర జరిగినట్లు ఆరోపించారు.