తమిళ టైగర్లకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధం రెండో దశలో సామాన్య ప్రజలు బలయ్యారని శ్రీలంక ప్రభుత్వం తొలిసారిగా అంగీకరించింది. శత్రువుతో జరిగే భీకర పోరాటంలో పౌర మృతులను అడ్డుకోవడం అసాధ్యమని శ్రీలంక రక్షణ శాఖ సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
శ్రీలంక సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందనే ఆరోపణలను ఈ నివేదిక ఖండించింది. శ్రీలంక జాతుల మధ్య దశాబ్దాల పాటు సాగి 2009 మార్చిలో ముగిసిన యుద్ధంలో కేవలం కొన్ని నెలల కాలంలోనే వేల మంది ప్రజలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి నిపుణుల ప్యానెల్ అంచనా వేసింది.
తమిళనాడులోని పార్టీలు యుద్ధ నేరాలకు పాల్పడ్డ శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సేను అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.