Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మామపై మానవుడు: నేటితో 40 ఏళ్లు పూర్తి

Advertiesment
అమెరికా
నేటికి సరిగ్గా 40 ఏళ్ల క్రితం అమెరికా ప్రయోగించిన అపోలో 11 కృత్రిక ఉపగ్రహంలో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు చందమామపై కాలుపెట్టారు. ప్రపంచ అంతరిక్ష పరిశోధనల చరిత్రలో నేటికి ఇదొక చిరస్మరణీయ విజయం. తొలిసారి మానవుడిని చంద్రుడిపై నడిపించిన ఘనతను అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) ఇప్పటికీ కాపాడుకుంటోంది.

ఆ తరువాత మరే ఇతర దేశం ఇంతటి సాహసానికి ధైర్యం చేయకపోవడంతో ఇప్పటికీ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం సాధించిన ఘనత పదిలంగా నిలిచివుంది. ఈ చారిత్రక సంఘటన ఆవిష్కృతమై 40 ఏళ్లు గడిచిన సందర్భంగా అమెరికాలో సోమవారం పెద్దఎత్తున వేడుకలకు రంగం సిద్ధమైంది. అమెరికా అధ్యక్ష భవనంలో అపోలో 11 మిషన్‌లో పాలుపుంచుకున్న సిబ్బందితో ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా సమావేశం కానున్నారు.

అనంతరం దీనికి సంబంధించి జరిగే వేడుకలను అధికారికంగా ప్రారంభిస్తారు. చంద్రుడి ఉపరితలంపై నడిచిన తొలి మానవుడిగా రికార్డుల్లోకెక్కిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తమ బృందం ప్రాణాలకు తెగించి చేసిన సాహసానికి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడుతూ.. ఇది ఓ మానవుడికి చిన్న అడుగే కావొచ్చు, కానీ మానవాళి చరిత్రలో ఇదొక పెద్ద అధ్యాయమన్నారు.

జులై 20, 1969న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపిన తొలి మానవుడిగా రికార్డు సృష్టించారు. దీనికి సంబంధించిన ప్రసారాలు 40 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో, రేడియాల్లో 500 మిలియన్ మంది పౌరులకు చేరినట్లు అంచనా. నీల్ బృందం చేసిన సాహసకృత్యం 1969, జులై 16న ప్రారంభమైంది.

ఆ రోజున తొలి మానవసహిత అపోలో 11 వ్యోమనౌక కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మిషన్ కమాండర్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కాగా, కమాండ్ మాడ్యూల్ పైలెట్ మైఖేల్ కాలిన్స్, లూనార్ మాడ్యూల్ పైలెట్ ఎడ్విన్ ఆల్డ్రిన్ ఉన్నారు. అపోలో 11 వ్యోమనౌక జులై 20, 1969న చంద్రుడిపై దిగింది.

జులై 21 తెల్లవారుజామున నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తొలిసారి చంద్రుడిపై కాలుమోపిన మానవుడిగా చరిత్రలో నిలిచిపోయారు. అనంతరం ఎడ్విన్ ఆల్డ్రిన్ కూడా చంద్రుడిపై అడుగుపెట్టారు. ఈ ఇద్దరు వ్యోమగాములు చంద్రుడిపై నడిచి, అక్కడ అమెరికా పతాకాన్ని నాటారు. 1969, జులై 24న మధ్యాహ్నం 4 గంటల 50 నిమిషాలకు అపోలో 11 వ్యోమనౌక సురక్షితంగా చంద్రుడిపై నుంచి భూమికి తిరిగివచ్చింది.

భూమి మీదకు వచ్చాక, ముగ్గురు వ్యోమగాములను 18 రోజులపాటు ఎవరికీ తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి నాసా వివిధ పరీక్షలు నిర్వహించింది. వీరికి చంద్రగ్రహంపై ఇన్ఫెక్షన్లు ఎవైనా సోకివుంటాయనే అనుమానంతో నాసా వారిని జనవాసాలకు దూరంగా తీసుకెళ్లింది. ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారించుకున్న అనంతరం నీల్ బృందంతో నాసా 45 రోజులపాటు విజయోత్సవ ప్రపంచయాత్రను నిర్వహించింది.

Share this Story:

Follow Webdunia telugu