ఆస్ట్రేలియాలో మరో ముగ్గురు భారత విద్యార్థులపై దాడి జరిగింది. జాతి వివక్ష దాడులను అణచివేస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటన ఆశించినంతగా ఫలితాలను సాధించలేదు. భారతీయులపై జాతి వివక్ష దాడులు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ఆడిలైడ్, సిడ్నీలో జరిగిన దాడులే ప్రత్యక్ష తార్కాణం. సిడ్నీలోని హోటల్ సమీపంలో చోటుచేసుకున్న దాడిలో ఇద్దరు భారతీయ విద్యార్థులు గాయపడగా ఆడిలైడ్‌లో మరో విద్యార్థిపైనకూడా దాడి జరిగినట్లు సమాచారం.