Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయ సంతతి రామకృష్ణన్‌కు నోబెల్ పురస్కారం

Advertiesment
భారతీయ సంతతి
భారతీయ సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త వెంకటరామన్ రామకృష్ణన్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

జీవకణాల్లో ప్రొటీన్ల ఉత్పత్తికి కారణమయ్యే రైబోజోమ్స్‌ల ఉనికిని పరమాణువుల స్థాయిలో కనిపెట్టినందుకుగాను రామకృష్ణన్‌కు మరో ఇద్దరితో కలిపి ఈ బహుమతి లభించింది. అమెరికాకు చెందిన థామస్‌స్టీజ్, ఇజ్రాయెల్‌కు చెందిన అదా ఈయోనాలకు కూడా రామకృష్ణన్‌తో పాటు నోబెల్ బహుమతి లభించింది.

వీరి పరిశోధనలు ఔషధరంగంలో విప్లవాత్మకమార్పులకు దారితీస్తాయని నోబెల్ బహుమతికి అర్హులను ఎంపికచేసే రాయల్ స్వీడిష్ అకాడెమీ ప్రశంసించింది.

రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన నాలుగవ మహిళ అదా ఈ యోనా. 1964 తరువాత ఈ పురస్కారం పొందిన మహిళ ఈమె కావటం విశేషం.

ఇదిలావుండగా వెంకటరామన్ రామకృష్ణన్‌ తమిళనాడులోని చిదంబరంలో 1952లో జన్మించారు. 1971లో బరోడా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్‌సీ ఫిజిక్స్‌లో పట్టా పుచ్చుకున్నారు.

అలాగే ఓహియో విశ్వవిద్యాలయం నుంచి 1976లో భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని జీవశాస్త్ర విభాగంలో చేరి తరగతులు నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu