Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బేనజీర్‌, ఇమ్రాన్‌ల మధ్య ఇదయ్యో...!

Advertiesment
పాకిస్తాన్
FILE
పాకిస్తాన్‌ దేశపు మాజీ ప్రధాని స్వర్గీయ బేనజీర్‌ భుట్టో, ఆదేశ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, రాజకీయ నేత ఇమ్రాన్‌ ఖాన్‌‌లకు మధ్య రొమాన్స్‌ నడిచిందని క్రిస్టఫర్‌ సాండ్‌ఫోర్డ్‌ అనే రచయిత వెల్లడించారు.

మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్‌ జీవితంపై రాసిన పుస్తకంలో ఆయన ఈ సంచలనాత్మకమైన వ్యాఖ్య చేశారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు వారిరువురి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని ఆయన అన్నారు.

వారిద్దరు అత్యంత సన్నిహితంగా మెలిగారని, వారిద్దరి మధ్య లైంగిక సంబంధం కూడా ఉండి ఉండవచ్చునని ఆయన తన రచనలో అనుమానం వ్యక్తం చేశారు. అప్పట్లో వారిరువురికి ఇమ్రాన్‌ ఖాన్‌ తల్లి పెళ్లి చేయడానికి కూడా ప్రయత్నించిందని, అయితే ఫలితం లేకపోయిందని రచయిత అన్నారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ బెనజీర్‌ భుట్టోపై వ్యక్తిగత, రాజకీయ విమర్శలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె హత్యకు కొద్ది రోజుల ముందు కూడా ఇమ్రాన్‌ తీవ్ర విమర్శ చేశారు. సాండ్‌ఫోర్డ్‌ తన పుస్తకం రాయడానికి ఇమ్రాన్‌ను, ఆయన మాజీ భార్య జమీమ్‌ను ఇంటర్వ్యూ చేసినట్లు ఆ రచయిత చెప్పుకున్నారు.

తన 21వ యేట లేడీ మార్గరెట్‌ హాల్‌లో పొలిటికల్ సైన్స్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు 1975లో భుట్టోకు ఇమ్రాన్‌తో సాన్నిహిత్యం ఏర్పడిందని సాండ్‌ఫోర్డ్‌ అంటున్నారు.

ఇదిలావుండగా ఇమ్రాన్‌ను తొలిసారిగా 'లాహోర్‌ సింహం' అని పిలిచిన వ్యక్తి బేనజీర్‌ భుట్టోనేనని చెప్పుకోవడం పరిపాటి. నెల, రెండు నెలలు వారిద్దరు అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు సాండ్‌ఫోర్డ్‌ డైలీ మెయిల్‌కు చెప్పినట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక రాసింది.
webdunia
FILE


కాగా సాండ్‌ఫోర్డ్‌ తన పుస్తకంలో రాసుకున్న వ్యాఖ్యలను ఇమ్రాన్‌ ఖాన్‌ ఖండించారు. బెనజీర్‌తో తనకు లైంగిక సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సాండ్‌ఫోర్డ్‌ తనను ఇంటర్వ్యూ చేసిన మాట నిజమేనని, అయితే తాను ఆ పుస్తకాన్ని ఇంకా చదవలేదని ఆయన చెప్పారు.

ఇంటర్వ్యూ తప్ప రచయిత మిగతా ఏదైతే రాశాడో అదంతా అధికారికం కాదని ఆయన అన్నారు. తమ మధ్య లైంగిక సంబంధం ఉందని, తన తల్లి పెళ్లికి ఏర్పాట్లు చేసిందని చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని, తామిద్దరం మిత్రులం మాత్రమేనని ఈ సందర్భంగా ఇమ్రాన్ మీడియాకు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu