తాలిబన్ ప్రధాన నాయకుడు బైతుల్లా మెహసూదే పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టోను హత్య చేయించే పథకాన్ని రూపొందించాడు.
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టోను హత్య చేయించింది తాలిబన్ ప్రధాన నాయకుడు బైతుల్లా మెహసూదేనని తహరీక్-ఏ-తాలిబన్ మాజీ నాయకుడు తుర్కిస్థాన్ భిటానీ తెలిపారు.
తహరీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ నాయకత్వంనుంచి బయటపడ్డ భిటానీ తెలిపిన వివరాల ప్రకారం బేనజీర్‌ను చంపించేందుకు మెహసూద్ రావల్పిండికి ఇద్దర్ని సిద్ధం చేసి పంపినట్లు తనకు చెప్పాడని ఆయన తెలిపారు. వీరిరువురు డిసెంబర్ 2007లో బేనజీర్‌ను హతమార్చారని ఆయన పేర్కొన్నారు.