Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బలూచిస్థాన్‌లో 18 మంది షియా భక్తుల కాల్చివేత!

Advertiesment
బలూచిస్థాన్
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టాలో తీర్థయాత్రకు వెళుతున్న షియా భక్తులపై నిషేధిత అతివాద సంస్థకు చెందిన సాధువులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది భక్తులు గాయపడ్డారు.

శనివారం పని కోసం వ్యానులో వెళ్తున్న హజారా షియా వర్గం ప్రజలపై దుండుగులు కాల్పులు జరపగా, ఒక మహిళ సహా 11 మంది చనిపోయారు. నలుగురు గాయపడ్డారు. అలాగే, మరికొందరు తీర్థయాత్రకు ఇరాన్‌కు బయలుదేరి వెళుతుండగా షియా భక్తులపై గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు బలయ్యారు. ఈ దాడికి పాల్పడింది తామేనని లష్కరే జంఘ్వీ అనే నిషిద్ధ అతివాద సంస్థ ప్రకటించింది.

క్వెట్టాలో సున్నీ వర్గానికి చెందిన పండితుడు మౌల్వీ హత్యకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు అతివాదులు ప్రకటించుకున్నారు. తమ వర్గం ప్రజల కాల్చివేతకు నిరసనగా షియాలు నగరంలో భారీ స్థాయిలో ఆందోళనకు దిగారు. పలు వాహనాలను, దుకాణాలను తగలబెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu