Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రెంచ్ పరిశోధకురాలికి ఇరాన్‌లో బెయిల్?

Advertiesment
ఇరాన్
ఇరాన్ అధికారులు మరికొన్ని గంటల్లో గూఢచర్య ఆరోపణలపై నిర్బంధించిన ఫ్రెంచ్ పరిశోధకురాలని బెయిల్‌పై విడుదల చేసే అవకాశం ఉందని ఆమె తండ్రి తెలిపారు. టెహ్రాన్‌లో ఆరు వారాల క్రితం గూఢచర్య ఆరోపణలపై క్లోటిల్డే రెయిస్‌ను ఇరాన్ అధికారిక యంత్రాంగం నిర్బంధించింది. ఆమెకు గురువారం బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉందని ఆమె తండ్రి రెమీ రెయిస్ పేర్కొన్నారు.

తన కుమార్తెకు గురువారం బెయిల్ లభించిన పక్షంలో శనివారమైన ఇది జరిగే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఇరాన్‌లో సెలవు దినం కావడంతో శనివారం తన కుమార్తె బెయిల్ అభ్యర్థను ఇరాన్ అధికారిక యంత్రాంగం పరిశీలిస్తుందన్నారు. కొన్ని వందల డాలర్ల పూచీకత్తుపై ఇరాన్ అధికారిక యంత్రాంగం ఆమెకు బెయిల్ మంజూరు చేయనుంది. బెయిల్ పూచీకత్తుకు ఫ్రాన్స్ ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది.

ఇరాన్ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నిక అక్రమ మార్గంలో జరిగిందని ఆయన ప్రత్యర్థులు భారీ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు పశ్చిమదేశాలు ఆజ్యం పోస్తున్నాయని ఇరాన్ అధికారిక యంత్రాంగం భావించింది. దీనికి సంబంధించి 110 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధకురాలు క్లౌటిల్డే రెయిస్ కూడా ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu