ఫ్రాన్స్ అధ్యక్షుడికి చేదు అనుభవం ఎదురైంది. మాక్రాన్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ ఆగ్నేయ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో మాక్రాన్‌కు పరాభవం తప్పలేదు. పర్యటనలో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో చేయి కలిపేందుకు ప్రయత్నించగా.. మాక్రాన్ చేయి అందించాడు.
ఆ వ్యక్తి మాక్రాన్‌తో చేయి కలిపినట్లుగానే కలిపి చెంపపై ఒక్కటిచ్చాడు. ఊహించని ఈ ఘటనకు అధ్యక్షుడుతో పాటు అక్కడున్న వారంతా షాక్ గురయ్యారు. అయితే పక్కనే ఉన్న మాక్రాన్ అంగరక్షకులు వెంటనే స్పందించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో సమాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆకుపచ్చ రంగు టీ షర్టు, కళ్లజోడు, మాస్కు పెట్టుకున్న ఓ వ్యక్తి 'డౌన్ విత్ మేక్రోనియా' అని అరుస్తూ మేక్రాన్ చెంప చెళ్లమనిపించిన దృశ్యాలు కనిపించాయి.