పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, తన భార్య బేనజీర్ భుట్టోను చంపిన హంతకులు దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నారని అసిఫ్ అలీ జర్దారీ చెప్పారు. ఈ హత్య ద్వారా ఆమె మద్దతుదారులను రెచ్చగొట్టేందుకు వారు కుట్రపన్నారని పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ పేర్కొన్నారు. తద్వారా భుట్టో హంతకులు పాకిస్థాన్‌ను ముక్కులచేసే పనిని సులభతరం చేసుకోవాలనుకున్నారని తెలిపారు.
భుట్టో హత్యపై దర్యాప్తు జరపాలని పాకిస్థాన్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిని కోరిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ విజ్ఞప్తిపై ఇటీవల ఐక్యరాజ్యసమితి ఇటీవలీ భుట్టో హత్యపై దర్యాప్తుకు కమిటీని ఏర్పాటు చేసింది. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రను బయటపెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఐరాసను ఆశ్రయించిందని భుట్టో హత్యపై దర్యాప్తు కోసం ఏర్పాటయిన ముగ్గురు సభ్యుల కమిటీతో జర్దారీ చెప్పారు.