Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌లో హింస పెరగవచ్చు: అమెరికా

Advertiesment
ఆఫ్గనిస్థాన్
ఆఫ్గనిస్థాన్‌లో అమెరికా సైనికుల సంఖ్య పెంచడంతో తాలిబన్-అల్‌ఖైదా తీవ్రవాద దళాలు సంయుక్తంగా కలిసి పాక్‌లో హింసను సృష్టిస్తాయని అమెరికా భావిస్తోంది.

ఆఫ్గనిస్థాన్‌లో తమ సైన్యాన్ని ఎక్కువగా పంపడంతో అక్కడి పరిస్థితులు చక్కబడుతాయనుకుంటే పొరబడినట్లేనని అమెరికాకు చెందిన మాజీ ద్యౌత్యాధికారి మలీహా లోధీ అమెరికా సెనేట్‌కు తెలిపారు. విదేశీ వ్యవహారాల సమితి సమక్షంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.

ఆఫ్గనిస్థాన్ ప్రాంతంలో అమెరికా తన సైన్యాన్ని పెంపొందించుకుంటే పరిస్థితులు చక్కబడేకన్నాకూడా హింస మరింత పెరిగే సూచనలున్నాయని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అక్కడున్న రెండు ఉగ్రవాద దళాలు సంయుక్తంగా హింసను సృష్టిస్తాయని ఆయన తెలిపారు.

తాలిబన్లనే కేంద్రంగా చేసుకుని వారిని హతమార్చే ప్రయత్నం చేసేముందు అల్‌ఖైదాను కూడా దృష్టిలో పెట్టుకుని అమెరికా సైన్యం ముందడుగు వేయాలని లోధీ సూచించారు.

అమెరికా తన సైన్యాన్ని మరింతగా ఆఫ్గనిస్థాన్‌కు చేరవేస్తే తాలిబన్, అల్‌ఖైదా ఉగ్రవాద దళాలు సంయుక్తంగా కలిసి పనిచేసే సూచనలున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల్లో హింస పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే పశ్చిమ దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొనే సూచనలు్న్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం పాకిస్థాన్ భద్రతా బలగాలు దాదాపు 150,000 సరిహద్దు ప్రాంతాల్లో పొంచివున్నారన్నారు. ఒకవేళ ఆఫ్గనిస్థాన్‌లో అమెరికాకు చెందిన సైనికుల సంఖ్యను పెంచితే పాకిస్థాన్‌ దేశంలో హింస పెరగవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రజల సాధారణ జీవితం అతలాకుతలమౌతుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu