Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్‌తో అణు ఒప్పందం కుదరదు: అమెరికా

పాకిస్థాన్‌తో అణు ఒప్పందం కుదరదు: అమెరికా
, గురువారం, 8 ఏప్రియల్ 2010 (11:32 IST)
అణు ఒప్పందంపై భారతదేశంతో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగా పాకిస్థాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవడం కుదరదని అమెరికా స్పష్టం చేసింది.

పాకిస్థాన్ దేశానికి అవసరమయ్యే అణుశక్తిపై తమ ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోందని, కాని ఆ దేశంతో అణు ఒప్పందం చేసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పీ.జే. క్రౌలే మీడియాకు తెలిపారు.

ఇటీవల తమ దేశాల భేటీలో ఈ అంశం చర్చకు రాలేదని ఆయన అన్నారు. కాని తమకు 56 పేజీల వినతిని, పాక్‌కు అవసరమయ్యే అంశాలు అందులో పొందుపరచడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా భారతదేశంతో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందంలాగే తమ దేశంతో కూడా అణు ఒప్పందం చేసుకోవాలని తమను కోరిందన్నారు.

కాని పాకిస్థాన్ విన్నపాన్ని ఒబామా ప్రభుత్వం తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. పాకిస్థాన్‌తో అణు ఒప్పందం చేసుకుంటే అణు ఆయుధాలు అల్‌ఖైదా, తాలిబన్ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని అమెరికా భావిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

క్రౌల్ ప్రకటనానంతరం పాకిస్థాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ పార్లమెంటు సభ్యులతో కలిసి ఇస్లామాబాద్‌లో మాట్లాడారు. భారతదేశం లాగే తమ దేశం కూడా అన్ని రకాల అవసరాలను పూర్తి చేసిందని ఆయన సభ్యులకు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అణ్వాయుధాలను పొందేందుకు పాకిస్థాన్ సిద్ధమైందని ఆయన తెలిపారు. దీంతో తమకు అణు ఇంధన కష్టాలు తొలగనున్నాయన్నారు.

ఇదిలావుండగా అణు ఇంధన బ్యాంకును ఏర్పాటు చేసేందుకు అమెరికా సన్నద్ధమౌతోందని ఒబామా సన్నిహితుల్లో ఒకరు తెలిపారు. దీంతో వివిధ దేశాలు శాంతియుతంగా అణుశక్తిని ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుందని ఆయన అన్నారు. దీంతో ప్రపంచంలో అణుశక్తి వలన కలిగే నష్టాలను కూడా తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu