నేపాల్‌కు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య పెరిగినట్లు పర్యాటక అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ హిమాలయ దేశాన్ని 2010లో ఆరు లక్షలకు పైగా భారతీయులు సందర్శించారు. 2009తో పోలిస్తే ఈ గణాంకాలు 70 శాతం అదనం.
నేపాల్‌ను వాయు మార్గంలో సందర్శించే భారత పర్యాటకుల కంటే రోడ్డు మార్గంలో పర్యటించే వారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ. గత ఏడాది భూమార్గం ద్వారా ఐదు లక్షల మంది భారతీయులు నేపాల్‌లో పర్యటించగా లక్ష మంది మాత్రమే విమానమార్గంలో సందర్శించినట్లు నేపాల్ టూరిజమ్ బోర్డు వెల్లడించింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి కోసం గానూ 2011ను నేపాల్ పర్యాటక ఏడాదిగా ప్రకటించిన నేపాల్ ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది.