పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, తన తల్లి బేనజీర్ భుట్టో హత్యకు జరిగిన కుట్రలో తమ దేశ మాజీ సైనిక పాలకుడు, అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ హస్తం కూడా ఉందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ పేర్కొన్నారు. తన తల్లి హంతకుడు కేవం ట్రిగ్గర్ మాత్రమే నొక్కాడని, అయితే అతని తుపాకీలో బుల్లెట్లు నింపిందని "నియంత" అని బిలావల్ చెప్పారు.
ఈ మేరకు ది నేషన్ ఓ కథనాన్ని వెల్లడించింది. తన తల్లి హంతకులను త్వరలోనే పాకిస్థాన్ నుంచి తుడిచిపెడతామని బిలావల్ చెప్పారు. బ్రిటన్ పీపుల్స్ పార్టీ బేనజీర్ భుట్టో పుట్టినరోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వేడుకలో పాల్గొన్న సందర్భంగా బిలావల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. స్వాత్ లోయలో జరుగుతున్న యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పౌరులకు సాధ్యమైనంత సాయం చేయాలని పాకిస్థాన్ ప్రజలకు బిలావల్ పిలుపునిచ్చాడు.