ఉత్తర ఇరాక్‌లో శనివారం ట్రక్కులో అమర్చిన బాంబులు పేలి కనీసం 25 మంది మృత్యువాత పడ్డారు. మరో డజను మంది గాయపడినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. జూన్ 30వ తేదీన నుంచి ఈ ప్రాంతం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ బాంబు పేలుడు జరగడం గమనార్హం.
కర్‌కుక్ అనే ప్రాంతంలో షియా మసీదు సమీపంలో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే అమెరికా దళాలు ఉపసంహరణ జరుగుతుందని ఇరాక్ ప్రధాని భావిస్తున్న తరుణంలో ఈ పేలుడు జరగింది.
దీనిపై బోలీసు బ్రిగ్ జనరల్ సర్హాత్ ఖాదర్ మాట్లాడుతూ.. తాజా ప్రాంతంలోని మసీదుకు ప్రార్థనల కోసం వెళుతుండగా, ట్రక్కులో అమర్చిన బాంబులు పేలాయని చెప్పారు. ఈ పేలుడు ధాటికి ఎనిమిది గృహాలు కూడా ధ్వంసమయ్యాయని చెప్పారు.