తీవ్రవాద దాడులను ప్రసారం చేయవద్దని పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియాకు విజ్ఞప్తి చేసింది. తీవ్రవాద దాడులు, ఇతర హింసాత్మక సంఘటనలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని సూచించింది. ఇటువంటి దుశ్చర్యలను ప్రసారం చేయడం వలన ప్రజలు భయకంపితులు అవుతున్నారని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఖమర్ జమన్ కైరా తెలిపారు.
పాకిస్థాన్ బ్రాడ్‌కాస్టర్ల సంఘం తయారు చేస్తున్న నియమావళి కోసం ప్రభుత్వం ఎదురుచూస్తుందని చెప్పారు. హామీ ఇచ్చిన విధంగా పాక్ బ్రాడ్‌కాస్టర్ల సంఘం దీనిని రూపొందించని పక్షంలో, తామే ఇందుకోసం ఏ కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పాకిస్థాన్ తీవ్రవాదుల నుంచి ఇప్పుడు తీవ్ర ముప్పును ఎదుర్కొటుంది. ఇటువంటి పరిస్థితుల్లో భద్రతా సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.