పాకిస్థాన్‌కు చెందిన క్వేటా పట్టణంలో తాలిబన్లకు ఐఎస్ఐలోని ఓ వర్గం సహాయపడుతోందని ఆదివారం మీడియాలో వచ్చిన వార్తలబట్టి స్పష్టమౌతోందని అమెరికా అభిప్రాయపడింది.
పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను పట్టుకునేందుకు లేదా వారిని హతమార్చేందుకు తమ దేశానికి చెందిన కమాండోలను పంపించేందుకు ఆలోచించుకోవాల్సి వస్తోందని, అక్కడున్న తాలిబన్లకు పాక్‌కు చెందిన ఐఎస్ఐ సహాయపడుతోందని ఆదివారం మీడియాలో వచ్చిన వార్తలబట్టి తెలుస్తోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.
క్వేటాలో ముల్లా అమర్ మరియు తాలిబన్ నేతృత్వంలో వాయుసేనల ద్వారా ఆక్రమణలు పొందేందుకు అమెరికా నిరాకరిస్తోంది. ఐఎస్ఐ సహాయంతో తాలిబన్లు ఆఫ్గనిస్థాన్ నుంచి పాకిస్థాన్‌లో సులభంగా తమ స్థావరాలను ఏర్పరచుకుంటున్నారని అమెరికా అధికారులు తెలిపినట్లు లండన్‌కు చెందిన వార్తా సంస్థ తెలిపింది.
ఆఫ్గనిస్థాన్‌లోని ఉగ్రవాదులను అంతమొందించేందుకు అమెరికానుంచి పెద్ద ఎత్తున సైన్యం పంపించాలని అమెరికా నిర్ణయించిందని ఆ పత్రిక వెల్లడించింది.
ఇదిలావుండగా తాజాగా ఆఫ్గనిస్థాన్‌లో సైనికుల సంఖ్యను తగ్గించాలని, దీంతోపాటు పాక్‌లోని తాలిబన్లు మరియు అల్‌ఖైదాపై దృష్టి సారించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ సూచించినట్లు మీడియా కథనం వెలువడింది.
కాగా ప్రస్తుతం తాలిబన్ నేతలు తమ కార్యకలాపాలను కరాచీ పట్టణంవైపు విస్తరించనున్నారని, అక్కడ దాడులు పెరిగే సూచనలున్నట్లు అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని తమ కమాండోలను క్వేటా పంపించి తాలిబన్ నేతలను అడ్డుకోవాలని అమెరికా యోచిస్తోందని వార్తలు వెలువడ్డాయి.
పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని ఆదేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంకల్పించారని సమాచారం. కాని పాకిస్థాన్ సైన్యం దీనిని విరోధిస్తోందని అమెరికా ఆరోపించింది.