Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జులై 7న మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు

Advertiesment
నెవర్లాండ్
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలను ఆయన ఇష్టపడి కట్టుకున్న నెవర్లాండ్ ఎస్టేట్‌లో జరపాలనే ప్రతిపాదన విరమించుకున్నారు. మైఖేల్ జాక్సన్ కూడా నెవర్లాండ్ ఎస్టేట్‌లోనే తన అంత్యక్రియలు జరగాలని ఆకాక్షించారు. అయితే నెవర్లాండ్ ఎస్టేట్ పలు న్యాయవివాదాల్లో చిక్కుకొని ఉన్న కారణంగా అక్కడ మైఖేల్ అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబసభ్యులు నిరాకరించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే మైఖేల్ అంత్యక్రియలు జులై 7న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే మంగళవారం లాస్ ఏంజెలెస్‌లోని స్టాప్లెస్ సెంటర్‌లో ఆయన అంత్యక్రియలు జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్న సమాచారం. మైఖేల్ జాక్సన్ శవపరీక్ష నివేదిక వెల్లడించిన బ్రిటన్ పత్రిక "సన్" ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం ఉదయం 10 గంటలకు మైఖేల్ అంత్యక్రియలు ప్రారంభమవతాయని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu