Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాంధీ ఇంటిని కొన్న ఫ్రెంచ్‌ టూరిజం కంపెనీ

Advertiesment
దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో 1908 నుంచి 1910 వరకు భారత జాతిపిత మహాత్మాగాంధీ నివశించిన పూరిగుడిసె (ది క్రాల్‌)ను ఫ్రెంచ్‌ టూరిజం కంపెనీ దక్కించుకుంది.

ప్రపంచంలోనే టూరిజం రంగంలో అగ్రగామిగానున్న వోయగేవుర్స్‌ ద ముండే అనే ఫ్రెంచ్‌ కంపెనీ ఆ ఇంటి యజమానులు అడిగిన ధర కంటే రెట్టింపు ధర ఇచ్చి ఆ ఇంటిని కొనుగోలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా చారిత్రక సంపదను కొనుగోలు చేస్తున్న ప్రక్రియలో భాగంగానే గాంధీ నివశించిన ఇంటిని కూడా కొనుగోలు చేసి గాంధీ మ్యూజియంకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. వందేళ్ళ చరిత్ర కలిగిన ఆ ఇంటిని తమ సంస్థ కొనుగోలు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఆ ఇంటి యజమానులు నాన్సీ, జరోడ్‌ బాల్‌ 1981లో ఈ ఇంటిని 65వేలకు కొన్నారు. ప్రస్తుతం ఈ ఇంటిని 3,77,029 అమెరికన్‌ డాలర్లకు ఫ్రెంచ్‌ కంపెనీ కొనుగోలు చేసింది. జోహాన్నెస్‌బర్గ్‌లోని ఆర్కార్డ్స్‌లోనున్న ఆ ఇంటి నుంచే గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతాలను రూపొందించినట్లు చేసినట్లు ఆ యజమానులు తెలపడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu