లిబియా నియంత ముయమ్మార్ గడాఫీతో పాటు ఆయన మద్దతుదారులు దాగివున్న ట్రిపోలిలోని ప్రాంతాన్ని రెబెల్ బలగాలు చుట్టుముట్టాయని లిబియా నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్‌కు చెందిన మంత్రి ఒకరు వెల్లడించారు.
"ఆయన ఉన్న ప్రాంతాన్ని ప్రస్తుతం చుట్టుముట్టాం" అని న్యాయశాఖ మంత్రి మొహమ్మద్ అల్ అలాగీ ఒక న్యూస్ ఏజెన్సీతో తెలిపారు. నూతన లీగల్ అధారిటీని ఏర్పాటు చేయాడానికి తాను ట్రిపోలీ వస్తున్నట్లు న్యాయవాది అయిన అలాగీ చెప్పారు. ఇటీవలి రోజుల్లో ఘర్షణలు జరుగుతున్న రాజధాని ట్రిపోలికి దక్షిణాన ఉన్న అబూ సలీమ్ ప్రాంతంలో గడాఫీ ఆశ్రయం పొందుతున్నట్లు తాము భావిస్తున్నామని ఇతర రెబల్ అధికారులు చెబుతున్నారు. ఈ వారం ప్రారంభంలో గడాఫీని చుట్టుముట్టామని రెబల్ దళాలు ప్రకటించినప్పటికీ అవి నిరాధారమని తేలింది.