Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖర్చుల వివాదం: మరో బ్రిటన్ మంత్రి రాజీనామా

Advertiesment
బ్రిటన్ ఖర్చుల వివాదం
బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్ మంత్రివర్గంలో రేజింగ్ స్టార్‌గా పేరొందిన ఆర్థిక శాఖ మంత్రి కిట్టీ ఉషెర్ ఎంపీ ఖర్చుల వివాదానికి బలైయ్యారు. బ్రిటన్ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎంపీల ఖర్చుల కుంభకోణం కారణంగా ఉషెర్ తన పదవికి రాజీనామా చేశారు.

ఎంపీల వివాదాస్పద ఖర్చులు మీడియాలో ప్రచురితం కావడంతో బ్రిటన్ ప్రభుత్వం సమస్యల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి అధికార లేబర్ పార్టీ సభ్యులు కొందరు ఇప్పటికే మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్ కూడా పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌లు వస్తున్నాయి. ఈ వివాదంలో చిక్కుకున్నవారిలో అన్ని పార్టీలవారు ఉన్నప్పటికీ, ఇది ప్రధానంగా అధికారపక్షాన్ని దెబ్బతీస్తోంది.

ఇప్పటికే కొందరు ఎంపీలు వచ్చే ఏడాది మధ్యలో జరగాల్సిన ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు రాజీనామా చేసిన ఉషెర్ 2007లో విక్రయించిన తన ఇంటికి పన్ను కట్టలేదని మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే తానేమీ తప్పుచేయలేదని ఆమె చెబుతూ వచ్చారు. తన వలన బ్రిటన్ ప్రభుత్వం ఇరకాటంలో పడకుండా ఉండేందుకు ఆర్థిక శాఖకు రాజీనామా చేస్తున్నట్లు ఉషెర్ ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమె నిర్ణయించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu