Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాశ్మీర్ వివాద పరిష్కారమే కీలకం: గిలానీ

Advertiesment
కాశ్మీర్ వివాదం
కాశ్మీర్ సమస్య పరిష్కారమే ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు దోహదపడుతుందని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ వివాద పరిష్కారం ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు కీలకమని గిలానీ పేర్కొన్నారు.

ఆయన మంగళవారం మాట్లాడుతూ.. భారత్‌తో ఈ వివాదాన్ని నిర్మాణాత్మక, శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నామని చెప్పారు. కాశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందని తెలిపారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం, కాశ్మీర్ ప్రజల ఆకాంక్షల ప్రకారం తాము ఈ వివాదాన్ని శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని గిలానీ ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో పేర్కొన్నారు. కాశ్మీర్ పౌరుల హక్కులకు పాకిస్థాన్ రాజకీయ, నైతిక, దౌత్య మద్దతు ఉంటుందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu