తన ఆత్మాహుతి దళాల కడుపు లోపల బాంబులు ఉంచి విమానాశ్రయాల వద్ద, భద్రతా దళాల కార్యాలయాల వద్ద పేలుళ్ళు జరిపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాదంలో అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ అగ్రగామిగావుంది. అత్మాహుతి దాడులతో ప్రజలను పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆత్మాహుతి దళాలకు చెందిన వ్యక్తుల కడుపుల్లో బాంబులువుంచి పేలుళ్ళకు పాల్పడేందుకు సన్నాహాలు చేస్తోందని అల్‌ఖైదా, తాలిబన్ వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారించిన రిచర్డ్ బారేట్ పేర్కొన్నట్లు సండే టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.
తాను హెచ్చరించడం లేదని, కాని ఇది ఓ హెచ్చరికలాంటిదేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అల్‌ఖైదా సామర్థ్యం గతంలోకన్నా చాలా తగ్గిపోయిందని, కాని ఇకపై ఆ ఉగ్రవాద సంస్థ ఇలాంటి మరిన్ని దాడులు చేసేందుకు పూనుకోనుందని ఆయన వివరించారు.