Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏథెన్స్‌లో కార్చిచ్చును ఆర్పివేసిన యంత్రాంగం

ఏథెన్స్‌లో కార్చిచ్చును ఆర్పివేసిన యంత్రాంగం
ఏథెన్స్ నగర శివారుల్లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును పూర్తిగా నియంత్రించామని మంగళవారం గ్రీసు అధికారిక యంత్రాంగం ప్రకటించింది. నాలుగు రోజుల క్రితం ఏథెన్స్ అడవుల్లో చెలరేగిన మంటలు బాగా విస్తరించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు. నాలుగు రోజులు తీవ్ర పోరాటం అనంతరం అగ్నిమాపక శాఖ మంటలను పూర్తిగా ఆర్పివేసిందని అధికారులు తెలిపారు.

గ్రేటర్ ఏథెన్స్ పరిధిలో ఇప్పుడు దావానలం పూర్తి నియంత్రణలో ఉందని, మళ్లీ మంటలు చెలరేగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ సిబ్బందిని కొనసాగిస్తున్నామని గ్రీసు అధికారులు తెలిపారు. తాజా దావానలం సుమారు 20 వేల హెక్టార్లకు విస్తరించింది. ఈ ప్రాంతంలో అడవితోపాటు, వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. సుమారు 500 అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పివేసే పనుల్లో పాల్గొన్నాయి.

గ్రీస్‌తోపాటు, ఆస్ట్రియా, సైప్రస్, ఫ్రాన్స్, ఇటలీ, టర్కీ అగ్నిమాపక శాఖలు కూడా ఏథెన్స్ కార్చిర్చును ఆర్పివేయడంలో కీలకపాత్ర పోషించాయి. ఇదిలా ఉంటే గ్రీసులోని మిగిలిన ప్రాంతాల్లోని అడవుల్లోనూ కార్చిర్చు వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో మంటలను ఆర్పివేసే చర్యలు కొనసాగుతున్నాయి. మౌంట్ కిథైరోనాస్, ఎవీయా ద్పీపంలోని కర్యాస్టోస్ ప్రాంతాల్లోనూ దావానలం చెలరేగింది.

Share this Story:

Follow Webdunia telugu