Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమర్జెన్సీ విధింపుపై ముషారఫ్‌కు సమన్లు

Advertiesment
పాకిస్థాన్
పాకిస్థాన్ సుప్రీంకోర్టు బుధవారం 2007 నవంబరులో దేశంలో ఎమర్జెన్సీ విధించడంపై మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమయంలో ముషారఫ్ తీసుకున్న ఈ నిర్ణయానికి న్యాయబద్ధతను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు తాజాగా ముషారఫ్‌కు సమన్లు జారీ చేసింది.

పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరి నేతృత్వంలోని 14 మంది సభ్యుల ధర్మాసనం ముషారఫ్ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని సమర్థిస్తూ గతంలో వెలువడిన తీర్పుపై పునర్విచారణ ప్రారంభించింది. గతంలో ముషారఫ్ నియమించిన న్యాయమూర్తులు అత్యాయిక పరిస్థితి (ఎమర్జెన్సీ), న్యాయమూర్తులను తొలగించడానికి సంబంధించిన నిర్ణయాలకు న్యాయబద్ధత ఉందని తీర్పు చెప్పారు.

తాజాగా ఈ తీర్పుపై పాకిస్థాన్ సుప్రీంకోర్టు పునర్విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ధర్మాసనం జులై 29న ముషారఫ్‌ను స్వయంగా లేదా న్యాయమూర్తి ద్వారా కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజున ఈ కేసుపై తదుపరి విచారణ జరుగుతుంది. ఇదిలా ఉంటే అటార్నీ జనరల్ లతీఫ్ ఖోసా మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ విధింపు నిర్ణయంతోపాటు, మాజీ అధ్యక్షుడికి ప్రభుత్వం ఏరకంగా ప్రాతినిధ్యం వహించబోదని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu