Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తర యమన్‌లో పేలిన యుద్ధ విమానం

Advertiesment
ఉత్తర యమన్
ఉత్తర యమన్‌లోని విద్రోహశక్తులున్న సానా ప్రాంతంలో ఓ యుద్ధ విమానం పేలిపోయింది. గతంలో జైదీ షియా వర్గీయులు ఈ విమానాన్ని పేల్చివేస్తామని ప్రకటించియున్నారు.

సానా ప్రాంతంలోనున్న విద్రోహకశక్తులను అంతమొందించేందుకుగాను దాడులకు పాల్పడేందుకు ఈ యుద్ధ విమానం వెళ్ళింది. కాని కొన్ని సాంకేతిక కారణాల వలన ఆ విమానం పేలిపోయినట్లు సైనిక ప్రతినిధి ఒకరు రక్షణమంత్రిత్వ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ఇదిలావుండగా దుర్ఘటనపాలైన విమానం ఇతర విమానాలతో కలిసి గాలిలో చక్కర్లు కొడుతుండిందని అనాద్ ప్రాంతంలో దుర్ఘటనకు ముందు భూమికి అతి సమీపంలో ఎగురుతుండిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu